Saturday, September 29, 2007

హోటల్లో ఎందుకు చెయ్యరు...

నా చిన్నప్పట్నించీ చూస్తూన్నాను. ఏ హోటల్లో కూడా (ప్రాంతాలతో సంబంధం లేకుండా) గోధుమరవ్వతో ఉప్మా అలాగే ప్రసిద్ధి గాంచిన చింతపండు పులిహోర ఎందుకు చేయరో అర్థం కావడంలేదు. ఈ విషయంలో ఎవరికైనా ఏదైనా పాయింటు తడితే కాస్త చెప్పరూ...

కొసమెరుపుః అసలు గుళ్ళల్లో చేసి పంచిపెట్టే సదరు చింతపండు పులిహోర రుచి " ఏమని వర్ణించనూ"....

10 comments:

రాధిక said...

మా ఊరిలో[గ్రీన్ బే] పెడుతున్నారు.చాలా బాగుంటుంది.

కందర్ప కృష్ణ మోహన్ - said...

రాధిక గారూ..
మీ ఊరంటే??

వికటకవి said...

ఏంటండీ మోహన్ గారు,

అదేదో మిరపకాయ బజ్జీ అంత సులువుగా దొరికెయ్యాలన్నట్లు మాట్లాడతారు :-) అసలు మాంచి చింతపండు పులిహోర ఒక పేటెంట్ స్థాయికి ఎదగాల్సిన వంటకం. నిజానికి ఘుమఘుమలాడే పులిహోర చెయ్యటానికి చాలా మాన్యూవల్ క్రియ ఉంది. మహిమంతా పోపులోనే కదా. అది మామూలు హోటళ్ళలో అయ్యే పనికాదు. అమ్మమ్మలు, బామ్మలు చెయ్యాల్సిందే. ఏమాట కామాటే, నేనూ అంత కాకపోయినా కొంత బానే చేస్తాననుకోండి. బయటల్లా, నిమ్మకాయ పులిహోరతోనే సరిపెట్టుకోండి. రుచికరమయిన చింతపండు పులిహోర దొరకటం కష్టమే.

http://sreenyvas.wordpress.com

గిరి Giri said...

మీరడిగినదానికి నాకు సమాధానం తెలియదు కానీ, వికటకవి అన్నది ఒప్పేసుకుంటా.

మరి ఆ మాటకొస్తే పరమాన్నము (అన్నంతో చేసేది, సేమ్యా కాదు) కూడా బైటెక్కడా లభ్యమవ్వదు అని అనుకునే వాడిని. మా ఇంటి దగ్గర మాంగో గ్రోవ్ అనే శాఖాహార హోటల్లో దొరికింది - మధ్యాహ్నపు బొఫేలో పెడతారు..రుచి సంగతి మాత్రం అడగకండి

phani.rebba said...

క్రిష్ణ మొహన్ గారికి, మీరు చెప్పింది అక్షరాలా నిజం. నాకైతే చింత పండు పుళిహోర అంటే మస్తు ఇష్టం. ఆప్పుడప్పుడు గుళ్ళోకి ఈ ప్రసాదం కొసమే వెల్తుంటా.

Unknown said...

హోటలెందుకండీ బాబు...
ఇంటికెళ్ళి అమ్మనడగండి. చక్కగా చేసిపెడుతుంది. లేదా మా ఇంటికయినా రావచ్చు :)

కందర్ప కృష్ణ మోహన్ - said...

ప్రవీణ్ గారికి
నెనర్లు..

Srikanth said...

ఆహా పులిహోర
నాకు అర్జంటుగా తినాలని ఉంది.

జ్యోతి said...

కృష్ణమోహన్,

ఎందుకు హోటళ్ళలో పెట్టలేదని వాపోవడం. అది ఇంట్లో చేస్తేనే బాగా కుదురుతుంది.గుడి టేస్ట్ గుడికే. అది మనకు రాదు.హాయిగా నేర్చుకుని చేసుకుని తినొచ్చుగా..

రాధిక ఉండేది అమెరికాలో

Unknown said...

నాకు మాత్రం గుడిలోదే బావుంటుంది.ఎవరూ చెస్తారో కాని అన్ని గుళ్ళలో ఒకేలాగా ఉంటుంది, మొహన్ గారు.
మా ఇంటికొచ్చి చేస్తారేమొ అని ఎన్ని సార్లో ప్రయత్నించా నో...