Sunday, December 10, 2017

స్వాతిముత్యం

కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బ్లాగు లోకి అడుగు పెట్టినట్లే చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు స్వాతిముత్యం సినిమా చూశాను.

ఒక మనిషి కొలత వేయలేనంత కాకపోయినా కనీసం కావలసినంత మంచితనంతో  జీవితం సాగించాలంటే పిచ్చివాడయితేనే సాధ్యమేమో అనిపించింది.. ఒక క్షణం పాటు.

ఎందుకంటే, నా జీవితంలో జీవం ఉండాలి అంటే..
౧. నాకు నిస్వార్థంగా సహాయపడినవారికి నా నుంచి కనీస కృతజ్ఞత చూపించగలుగుతూ, వారికి నిజంగా అవసరం అయినపుడు నేను అదే రకమైన సహాయం చేయగలిగి ఉండాలి.
౨. నేను నా శక్తికి మించి సహాయపడినవారికి నాపట్ల కనీస ప్రేమాభిమానాలు ఉండాలి.
౩. అసలు ఎప్పుడు ఎవరికి ఎలాంటి సమంజసమైన సహాయం అవసరమైనా చేయగలిగిన మనసు, పర్సు రెండూ ఉండాలి.

ఈ మూడు విషయాలలోనూ నా జీవితంలో లోపాలు ఉన్నాయి కాబట్టి నాలెఖ్ఖలో నేను బతికి ఉన్నట్లు కాదు.

ఈ జీవితంలో కనీసం మొదటి విషయాన్ని అయినా సాధించిన రోజున నేను మళ్ళీ బ్రతుకుతాను.

కచ్చితంగా సాధిస్తాననే నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు జీవంతో జీవించాలనే కోరిక ఉంది కాబట్టి.

మిత్రులందరికీ శుభాకాంక్షలు.

కృష్ణ మోహన్ కందర్ప

Saturday, October 30, 2010

ఆరోగ్యవర్థిని......

ప్రియమైన మిత్రులందరి కోసం...
ప్రత్యేకించి హైదరాబాద్ వాస్తవ్యుల కోసం..

మీ కృష్ణ మోహన్ కందర్ప


Wednesday, May 28, 2008

మరో పేరడీ...

2001 లో చిత్తూరు జిల్లా నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేసినప్పుడు 40 స్కూళ్ళ పిల్లలకోసం కట్టిన పాట ఇది...
పల్లవి:
కలలోనైన కలగనలేదే బడికెళ్తానని - మెలకువనైన అనుకోలేదే చదువొస్తుందని
ప్రభుత్వమే కరుణించి ఈపుస్తకమిప్పించి - అఆ లే నేర్పించి తెలివన్నది రప్పించి
గొప్ప గొప్ప చదువులన్ని నాకే నేర్పుతున్నది - నే మనిషినైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
హే హే.. హే హే..

చరణం:
బండపనికి* మాని బడికెళ్ళిపోనా - టీ కొట్టు పనికే టాటా చెప్పనా
కోతకలుపులైనా నేతమగ్గమైనా - మానివేసి నేనే మార్పే కోరనా
అక్షరమంటే లక్షలవిలువ - ఈ శిక్షణలోనా నే విరిసిన పువ్వా
తెలుగుభాషలోని వేల పదములు తెలియుచున్నవి
ఈ వెలుగుబాటలోకి నన్ను ముందుకు నడుపుచున్నవీ
హే హే.. హే హే..

బండపనికి* - చిత్తూరు జిల్లాలో రాళ్ళక్వారీల్లో చిన్నపిల్లల్ని విపరీతంగా వాడుకునేవారు. ఇప్పుడు చాలావరకూ తగ్గిందనే అనుకుంటున్నాను

Thursday, February 21, 2008

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు....


మిత్రులకు, భాషాభిమానులకు, తెలుగు బ్లాగర్లకు మరియు అన్ని అంతర్జాల తెలుగు సమూహాలకు....

Monday, December 31, 2007

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు....

మిత్రులందరికీ
2008
నూతన సంవత్సర శుభాకాంక్షలు......

Tuesday, November 20, 2007

స్నేహం - ప్రేమ...

నిఝంగా ఏ కల్మషమూ లేని స్థితి స్నేహానికి మాత్రమే ఉంది. స్నేహానికి పరాకాష్ట త్యాగం. ఆమధ్య శోభారాజు గారి దగ్గర అన్నమయ్య పాటలు పాడడానికి వెళ్ళినపుడు ఏదో మాటల్లో సందర్భం వచ్చి ఆవిడ అడిగింది. ప్రాణస్నేహితుడు అంటే నిజంగా ప్రాణం వదిలేసేటంత స్నేహితులు ఎవరికైనా ఉన్నారా అని అడిగితే నేను ఠపీమని అవునండీ నాకు ప్రసాద్ అనే ప్రాణస్నేహితుడున్నాడు, నేను తనకోసం తను నాకోసం నిస్సందేహంగా ప్రాణాలొదిలేయగలమని గాఠిగా చెప్పేటప్పటికి ఆవిడ చాలా ఆనందించింది. అంటే ప్రాణాలు సైతం వదిలివేయగలగడమనేది స్నేహంలో మాత్రమే నిరాటంకంగా జరుగుతుంది. కానీ ప్రేమికులు ఒకరికోసమొకరు ప్రాణాలొదిలివేయడమనేది విధిలేని పరిస్థితుల్లో మాత్రమే అంటే బలవంతంగా జరుగుతుంది. వాళ్ళు సంతోషంగా మరణానికి సిద్ధం కాలేరు అలా కాగలిగారు అంటే అది పూర్తిగా సంతృప్తి చెందిన స్థితి అన్నమాట. ఆ స్థితిని ప్రేమ అనేకంటే స్నేహం అంటేనే అందంగా ఉంటుంది.

ఇక ప్రేమ విషయానికొస్తే, ఒక స్పందన, ప్రతిఫలం, ఒకర్నించి ఒకరు ఆశించడమే ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక ముదుసలిని రోడ్డు దాటిస్తే వచ్చేది ఆనందం. ఆ సందర్భంలో సదరు మనిషి మనల్ని ప్రశంసిస్తేనో, కృతజ్ఞతాపూర్వకంగా మెరిసే కళ్ళతో చూస్తేనో తనమీద, ఆ పనిమీద మన ప్రేమ రెట్టింపవడం ఖాయం. నిజమైన ప్రేమ ప్రతిఫలం కోరదు వంటి మాటలు మనల్ని మనం మోసం చేసుకోడానికే పనికొస్తాయి. అస్సలు ప్రతిఫలం కోరనిది స్నేహం మాత్రమే. పైపనిని బాధ్యతగా భావించినపుడు మాత్రమే మనం అటునుంచి ప్రతిఫలం ఆశించడమనేది జరుగదు. అయితే ఆ బాధ్యతకి ప్రేమ కలిస్తే అందులో ఆర్ద్రత నిండడం ఖాయం.

ప్రేమలో తీయని బాధ ఉంటుంది. కానీ స్నేహంలో తీయదనం మాత్రమే ఉంటుంది.

నిజానికి ప్రేమ అనగానే ఆడామగా కలిసి గుర్తొచ్చేస్తారు. మనకి ఇదో పెద్ద దౌర్భాగ్యమని నా అభిప్రాయం. అలా మోసపోడానికి మన సినిమాలు కూడా ఇతోధికంగా సాయపడుతున్నాయి. దానివల్ల ఏమౌతోందంటే ప్రేమ అంటే నేరుగా శారీరక సంబంధానికి రాచబాట అనే మూసలోకి నేటి యువతరం పడి కొట్టుకుపోతోంది. ఇది ఎంతమాత్రం ఆరోగ్యకరం కాదు. అలాగే స్నేహం పేరుతో జాగ్రత్తగా మొదలెట్టి తర్వాత్తర్వాత మొత్తం సంబంధాన్ని భ్రష్టు పట్టించడమూ చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఎందువల్లంటే చిన్ననాటినుంచీ పిల్లలకి తల్లీదండ్రీ , విలువల గూర్చి చెప్పడంలో విఫలమవ్వడం వల్ల మాత్రమే.

వేటి నిర్వచనాలు వాటికున్నాయి. వాటిని వాటిగానే ఉండనివ్వండి. కలగూరగంప చేయకండి. స్నేహమూ ప్రేమా కవలపిల్లల్లాంటివి. ఒకలా కన్పిస్తాయంతే. పూర్తిగా ఒకే లక్షణాలతోనే ఉండాలనేమీ నియమం మాత్రం లేదు. నా అంతరాత్మతో నేను నిజమైన స్నేహం చేయగలిగితే నేను ఈ ప్రపంచం మొత్తానికీ ఎటువంటి వ్యత్యాసాలూ లేని ప్రేమని నిరాఘాటంగా అందించగలనని నాకు బలంగా అన్పిస్తూంటుంది. ఆచార్య ఆత్రేయ అన్నట్లుగా....

ఇచ్చుటలో ఉన్న హాయీ, వేరెచ్చటనూ లేనే లేదనీ
నిన్నను నాకు తెలిసింది, ఒక చిన్నది నాకు తెలిపింది
ఆ స్నేహనగరుకే పోతాను పోతాను పోతానూ...

Thursday, November 1, 2007

శుభాకాంక్షలు..


మా తెలుగు తల్లికి మల్లెపూదండ - మా కన్నతల్లికి మంగళారతులు
తెలుగు ప్రజలందరికీ
హృదయపూర్వక తెలుగు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు
కీర్తిశేషులు శ్రీ పొట్టి శ్రీరాములు గారికి కృతజ్ఞతాభివందనములతో.........