Sunday, December 10, 2017

స్వాతిముత్యం

కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బ్లాగు లోకి అడుగు పెట్టినట్లే చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు స్వాతిముత్యం సినిమా చూశాను.

ఒక మనిషి కొలత వేయలేనంత కాకపోయినా కనీసం కావలసినంత మంచితనంతో  జీవితం సాగించాలంటే పిచ్చివాడయితేనే సాధ్యమేమో అనిపించింది.. ఒక క్షణం పాటు.

ఎందుకంటే, నా జీవితంలో జీవం ఉండాలి అంటే..
౧. నాకు నిస్వార్థంగా సహాయపడినవారికి నా నుంచి కనీస కృతజ్ఞత చూపించగలుగుతూ, వారికి నిజంగా అవసరం అయినపుడు నేను అదే రకమైన సహాయం చేయగలిగి ఉండాలి.
౨. నేను నా శక్తికి మించి సహాయపడినవారికి నాపట్ల కనీస ప్రేమాభిమానాలు ఉండాలి.
౩. అసలు ఎప్పుడు ఎవరికి ఎలాంటి సమంజసమైన సహాయం అవసరమైనా చేయగలిగిన మనసు, పర్సు రెండూ ఉండాలి.

ఈ మూడు విషయాలలోనూ నా జీవితంలో లోపాలు ఉన్నాయి కాబట్టి నాలెఖ్ఖలో నేను బతికి ఉన్నట్లు కాదు.

ఈ జీవితంలో కనీసం మొదటి విషయాన్ని అయినా సాధించిన రోజున నేను మళ్ళీ బ్రతుకుతాను.

కచ్చితంగా సాధిస్తాననే నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు జీవంతో జీవించాలనే కోరిక ఉంది కాబట్టి.

మిత్రులందరికీ శుభాకాంక్షలు.

కృష్ణ మోహన్ కందర్ప

No comments: