Monday, June 18, 2007

ఇంకో పేరడీ

శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారికి క్షమాపణలతో...

పల్లవి :
అన్ని వేషములు నిన్నే ఆవహించెనూ - వెన్నతోనీకు కలిగె వేషభాషలన్నిను //అన్ని//
చరణం :
నారదుడు తప్పనిచ్చి పౌరాణిక వేషాలు - వేరె ఎన్నో వేసె పెక్కువిధములు
కోరకనె నీవు పొందె ఎన్నొ విజయఘోషలు - హారతులిచ్చిరి నీకు తెలుగుదేశ ప్రజలు //అన్ని//

సమాజమే దేవళం ప్రజలే దేవుళ్ళనే - నినాదమే నిన్ను చేసె ముఖ్యమంత్రిని
అన్న అన్న పిలుపునే సార్థకం చేసుకున్న - ధన్యుడవైతివి నీవు తారకరామా //అన్ని//

ఇన్ని వేషములకెల్ల ఎన్టీయారే గతి - అన్నది ఇదియే ఆంధ్ర ప్రజానీకము
నిన్ను గావగలిగెపో ఎవ్వడైన ధన్యుడౌను - వెన్నెలవంటిది నీ సమ్మోహన రూపము //అన్ని//
రచనా కాలం : 23-02-2004 - ఉ: 11.00

4 comments:

Unknown said...

పేరడీ అదిరింది! అన్న గారికి ఘనమైన నివాళి.
-నేనుసైతం
http://nenusaitham.wordpress.com

కందర్ప కృష్ణ మోహన్ - said...

కృతజ్ఞతలు......

gRAVIty said...

మీరు బ్లాగ్ చాలా బాగుంది
నేను కూడా ఒక బ్లాగ్ మొదలు పెడమనుకుంటున్నాను
quillpad.in/telugu గురించి మీ అభిప్రాయం ఏంటి

Unknown said...

కందర్ప కృష్ణ మోహన్ - గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.