Monday, June 11, 2007

ఒక పేరడీ

శ్రీ రామదాసు గారికి క్షమాపణలతో.......

పః అంతా జగను మయం - ఈ స్టేటంతా జగను మయం - అంతా

చః అంతరంగమున రాజశేఖరుని - అనంతరూపమున వింతలు సలుపగ
సిమెంటు కంపెనీ - సున్నపు రాళ్ళును ఆ మహాజనుల అసైన్డు భూములు - అంతా

చః ఫాక్షను బాంబుల అండదండలును - కక్షలు శిక్షలు కత్తులెత్తగను
ఆక్షను లేని భూములన్నియును గడప గడపలును - కడప మొత్తమును - అంతా

ఎవరినీ నొప్పించుటకు కాదు సుమా!

11 comments:

Naveen Garla said...

భలే ఉంది....చాలా సేపు నవ్వాను:)

కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏ కాంఘ్రెస్సు కార్యకర్తైనా చూశాడంటే...ఇంకేమన్నా ఉందా. ఆరోపణలు, దిష్టి బొమ్మలు. మొత్తం సి.ఐ.డి బృందం బ్లాగర్ల మీద పడుతుందేమో. భూములుంటే...వెంటనే చరిత్ర మార్చేసి..వాటిని అసైన్డ్ భూములుగా చేసెయ్యరూ.;)
- నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com

కందర్ప కృష్ణ మోహన్ - said...

బాబోయ్!
నిజమే సుమీ
ఇక నుంచి పార్టీలకి సంబంధం లేని పేరడీలే రాసుకుంటాను లెండి.
బ్రతుకుజీవుడా!

రాధిక said...

suuuuuper.

Naga said...

ఏం భయపడకు బ్రదరూ, ఎవ్వడూ ఏమీ పీకలేడు కానీ, మీ ఇష్టం వచ్చింది వ్రాసుకోండి. మీరు వ్రాసింది ఈనాడు-లో ఒక్క శాతం కూడా కాదు!! చాలా బాగుంది.

కందర్ప కృష్ణ మోహన్ - said...

ఓహ్!
నాగరాజు గారూ
ఏం ధైర్యమిచ్చారండీ
కృతజ్ఞుడ్ని..

Unknown said...

ఎంత ధైర్యం!!! ఆ రెండు పత్రిక లతో పాటు మిమ్మల్ని కూడా హిట్ లిస్ట్ లో చేర్చాలా.....

అదిరింది:)
-నేనుసైతం
http://nenusaitham.wordpress.com

రానారె said...

అదుర్స్. పాడుకోవడానికి ఏమాత్రం ఇబ్బందిలేకుండా బాగా రాశారు.

శ్రీ said...

మెట్టు ఇరిగిందబ్బీ....

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

భళా కందర్ప వారూ భళా..!

rākeśvara said...

చాలా బాగుంది, చాలా నిజం కూడా
ఇక భయం విషయానికొస్తే,
హీరో సినిమాలో డైలాగ్
"they can kill us, but they can not kill our written word"
అక్షరము - నశింపరానిది.

కందర్ప కృష్ణ మోహన్ - said...

నిజం.. నిజం..