Wednesday, May 28, 2008

మరో పేరడీ...

2001 లో చిత్తూరు జిల్లా నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేసినప్పుడు 40 స్కూళ్ళ పిల్లలకోసం కట్టిన పాట ఇది...
పల్లవి:
కలలోనైన కలగనలేదే బడికెళ్తానని - మెలకువనైన అనుకోలేదే చదువొస్తుందని
ప్రభుత్వమే కరుణించి ఈపుస్తకమిప్పించి - అఆ లే నేర్పించి తెలివన్నది రప్పించి
గొప్ప గొప్ప చదువులన్ని నాకే నేర్పుతున్నది - నే మనిషినైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
హే హే.. హే హే..

చరణం:
బండపనికి* మాని బడికెళ్ళిపోనా - టీ కొట్టు పనికే టాటా చెప్పనా
కోతకలుపులైనా నేతమగ్గమైనా - మానివేసి నేనే మార్పే కోరనా
అక్షరమంటే లక్షలవిలువ - ఈ శిక్షణలోనా నే విరిసిన పువ్వా
తెలుగుభాషలోని వేల పదములు తెలియుచున్నవి
ఈ వెలుగుబాటలోకి నన్ను ముందుకు నడుపుచున్నవీ
హే హే.. హే హే..

బండపనికి* - చిత్తూరు జిల్లాలో రాళ్ళక్వారీల్లో చిన్నపిల్లల్ని విపరీతంగా వాడుకునేవారు. ఇప్పుడు చాలావరకూ తగ్గిందనే అనుకుంటున్నాను

4 comments:

Unknown said...

chala baga vundandi mee peradi krishna mohan gaaru

Kottapali said...

"చిత్తూరు జిల్లా నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేసినప్పుడ"...
అంటే మీదగర బ్లాగడానికి బోలెడంత ముడిసరుకుందన్న మాట .. బ్లాగకపోవడం ఏం బాగాలేదు. మీ మీద వత్తిడి తెచ్చే కేసు ఎవరికి అప్పగించాలి?

కందర్ప కృష్ణ మోహన్ - said...

ఆల్రెడీ జ్యోతక్క వత్తిడి మేరకే ఈ మాత్రమైనా రాయడం జరుగుతోంది - మీరన్న పనికి అక్కయ్యే కరెక్టు...

జ్యోతి said...

hmmm..

నాకు ఉన్న పని చాలక ఇదొకటా??? కృష్ణమోహన్ ఇక నీ పని ఐపోయింది. ఆన్‍లైన్ దొరక్కుంటే నీకు ఫోన్ చేసి మరీ బ్లాగేలా చేస్తాను మరి. ఓకేనా? ఐనా నువ్వొక్కడివే బిజీ అనుకుంటున్నావా? మేము పనిలేక బ్లాగుతున్నామా?